డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, ఆదుర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈరోజు ఆదుర్ గ్రామంలో రూ.9 లక్షలు, రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, రూ.36 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, రూ.6.85 కోట్లతో లూటుకుర్రు, ఆదుర్రు గ్రామాలలో వాడబోది, బచ్చలబంద అవుట్ ఫాల్ స్లూయిస్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మొత్తం రూ.7.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.