ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా "అరిగెల శ్రీ రంగయ్య మెమోరియల్ ఆల్ ఇండియా వాలీబాల్ టోర్నమెంట్" నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 15, 2026 నుండి ఫిబ్రవరి 19, 2026 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళల జాతీయ స్థాయి జట్ల మధ్య పగలు, రాత్రి జరుగుతుంది. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.