కోనసీమ జిల్లాలో వరి కోతలు మంగళవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ సీజన్‌లో 1,77,863 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రైతులు శ్రీ ధృతి, MTU-3626, హైబ్రీడ్ బొండాలు, PR-126 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలను పండించారు. అనుకూల వాతావరణం, నీటి లభ్యత, ఆధునిక పద్ధతుల వల్ల ఎకరానికి 25-35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పల్లెల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.