సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి లంక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య సందడి నెలకొంది. రాజోలు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైసీపీ CEC సభ్యులు KSN రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ లు గ్రామంలోని ముఖ్య నేతలు ముత్యాల నాని, ముత్యాల కరుణ ప్రసాద్ లను కలిసి యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్భంగా పాముల రాజేశ్వరి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.