రేపు అంతర్వేది అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

872చూసినవారు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఉదయం 9 గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి నుండి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులకు సూచనలు చేశారు. దీనివల్ల అంతర్వేది క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్