పొన్నమండలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

1126చూసినవారు
పొన్నమండలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
రాజోలు మండలం పొన్నమండ తూర్పు పాలెం అంగన్వాడి కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కేంద్రానికి తరలివచ్చారు. ఉదయం 9:30 గంటల సమయానికి 113 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్