పశ్చిమగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక మఠం, పెదలంక మధ్య పంటకాలువపై రూ. 80.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంతెనకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం భూమిపూజ చేశారు. దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ప్రయాణ కష్టాలను తీర్చేందుకే ఈ వంతెన నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, సర్పంచులు తాళ్ల నాగరాజు, కోటిపల్లి రత్నమాల తదితరులు పాల్గొన్నారు.