ఏప్రియల్ 12వ తేదీన మలికిపురం కాలేజీ గ్రౌండ్‌లో జరగనున్న 135వ అంబేడ్కర్ జయంతోత్సవాల్లో పాల్గొనాలని రాజోలు మండల ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు రాజోలు మండలంలో కరపత్రాలను పంపిణీ చేశారు. రాజోలు కోర్టు ఆవరణంలో న్యాయవాదులకు కరపత్రాలు అందించి, జయంతోత్సవాలకు ఆహ్వానం పలికారు.