రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో, తాటిపాక ఈదరాడ కాలువ వద్ద జరుగుతున్న మట్టి తరలింపు పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శుక్రవారం కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు, రైతులు, ప్రజల సంక్షేమం కోసమే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.