రాజోలు టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, కూటమి ప్రభుత్వం చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. గురువారం రాజోలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు రూ.150 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని, మగ్గాల వారికి నెలకు రూ.1800 వరకు ఆదా అవుతుందని తెలిపారు. త్వరలోనే 'నేతన్న నేస్తం' కూడా అందుబాటులోకి వస్తుందని, ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ నేతన్నలకు అండగా నిలుస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.