రాజోలు: నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

258చూసినవారు
రాజోలు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఈఈ కె. రాంబాబు తెలిపారు. ఈ అంతరాయం వల్ల రాజోలు, శివకోటి, శివకోటిపాలెం, సోంపల్లి, బి. సావరం గ్రామాల్లో కరెంట్ ఉండదు. వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్