రాజోలు: 'ఎస్సీ వర్గీకరణ పోరాటం ముగియలేదు'

2456చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని RACCS వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్. ఎస్. రత్నాకర్ స్పష్టం చేశారు. రాజోలులో మంగళవారం ఆయన మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత సమాజంలో విభేదాలు సృష్టిస్తూ, మాల సామాజిక వర్గమే అన్ని ప్రయోజనాలు పొందుతోందని దుష్ప్రచారం చేయడం దళిత ఐక్యతను దెబ్బతీసే కుట్రని ఖండించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని, దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తుందని రత్నాకర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్