రాజోలు: 'శవ రాజకీయాలు చేయడం వైసీపీకు అలవాటే'

1035చూసినవారు
రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో తాటిపాకలో 33వ వారం "కేడర్ విత్ లీడర్" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, వైసీపీ శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం ఇవ్వని వైకాపా నేతలు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అనంతరం రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్