ములికిపల్లిలో రామలింగేశ్వర స్వామి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు

1462చూసినవారు
రాజోలు మండలం ములికిపల్లిలో శ్రీ పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. ఆలయ పునరుద్ధరణ తర్వాత వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్