అంతర్వేదిలో అరుదైన 'పులి మచ్చల' చేప

1258చూసినవారు
అంతర్వేదిలో అరుదైన 'పులి మచ్చల' చేప
సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల వలకు అరుదైన 'పులి మచ్చల గొరక' చేప చిక్కింది. చర్మంపై పులి మచ్చల వంటి ఆకారం ఉండటంతో దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ చేప రుచికరంగా ఉండటంతో మాంసాహార ప్రియులు కొనేందుకు పోటీ పడ్డారు. పండుగ సీజన్ కావడంతో ఈ అరుదైన చేప ధర కిలో రూ. 400 పైగా పలుకుతోందని స్థానిక మత్స్యకారులు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్