సఖినేటిపల్లి-నరసాపురం ఫెర్రీ 2026-27 సంవత్సరానికి సంబంధించిన వసూలు హక్కుల కోసం సోమవారం నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో టేకిశెట్టిపాలానికి చెందిన శ్రీవిఘ్నేశ్వర శాండ్ క్వారీ & బోట్స్‌మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అత్యధికంగా రూ. 3,70,01,000 కోట్ చేసి దక్కించుకుందని ఎంపీడీవో రాజ్ కుమార్ తెలిపారు.