సఖినేటిపల్లి: సర్పంచుల సేవలు వినియోగించుకుంటాం: ఎమ్మెల్యే

344చూసినవారు
మంగళవారం సఖినేటిపల్లిలంక సర్పంచ్ రేపూరి రాజేశ్వరి దేవి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదవీ విరమణ చేసినా సర్పంచుల సేవలను గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిన సర్పంచ్ భర్త, జనసైనికుడు ఏసు నరశింహరాజ కృషిని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం సర్పంచ్ దంపతులను ఆయన ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్