రాజోలులో ఎస్‌బీఐ నూతన శాఖ ప్రారంభం

12చూసినవారు
కోనసీమలోని రాజోలులో 66 ఏళ్లుగా సేవలందిస్తున్న ఎస్‌బీఐ శాఖను మెరుగైన వసతులతో నూతన ప్రాంగణంలోకి మార్చారు. ఈ నూతన భవనాన్ని నెట్‌వర్క్ జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జెనా ఆదివారం ప్రారంభించారు. కస్టమర్ల సహకారంతో "సదా మీ సేవలో" అనే దృక్పథంతో మరిన్ని ఉన్నత సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పంకజ్ కుమార్, ఆర్‌ఎమ్ అశోక్ నాగరాజన్, బీఎమ్ శ్రీనివాస్, సిబ్బంది మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్