రాజోలులో SC సర్పంచ్‌లకు ఘన సన్మానం రేపు

99చూసినవారు
రాజోలు నియోజకవర్గంలోని రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని SC సర్పంచ్‌లకు వారి ఐదేళ్ల సేవలకు గాను రేపు, అనగా 29 మార్చి 2026 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజోలు అంబేడ్కర్ భవనంలో ఘనంగా సన్మానించనున్నారు. రాజోలు నియోజకవర్గ SC సంక్షేమ సంఘం అధ్యక్షులు పొలమూరి శ్యాంబాబు అధ్యక్షతన, ముఖ్య అతిథిగా రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొని సర్పంచ్‌లను సత్కరిస్తారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాలలోని SC సర్పంచ్‌లు, నాయకులు తరలిరావాలని SC సంక్షేమ నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్