రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం శంకరగుప్తం గ్రామంలో రూ. 1.92 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మదనగోపాల స్వామి గుడి, చిన్న వంతెన వద్ద రూ. 1.70 కోట్లతో నిర్మించిన బి.టి. రోడ్లు, రూ. 18 లక్షలతో సి.సి. రోడ్డు, రూ. 3.80 లక్షలతో నిర్మించిన పంచాయతీ ప్రవేశద్వారాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాపాక ఆనందకుమార్, టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, ఇతర ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.