అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా శాంతి కళ్యాణం

947చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బహుళ ద్వాదశి సందర్భంగా శుక్రవారం స్వామి వారి శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు, మాంగల్యధారణ ఘట్టాలను జరిపారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ జరిగిన ఈ వేడుకలో పాల్గొనడం వల్ల వివాహ గండాలు తొలగి, అనారోగ్య, శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్