శుక్రవారం ఉదయం రాజోలు మండలాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచే మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు. ఉదయం 8 గంటల వరకు మంచు వీడకపోవడంతో జనజీవనం నెమ్మదిగా సాగింది.