జిల్లాలో రౌడీయిజం, గూండాయిజం అణచివేతకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేర చరిత్రను విస్మరించి, సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా జీవించాలని పోలీసులు సూచించారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠిన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేస్తూ వారి ప్రస్తుత కదలికలపై నిఘా ఉంచారు.