సఖినేటిపల్లి మండలం అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య తిరు కల్యాణ మహోత్సవం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:56 గంటలకు, రోహిణి నక్షత్ర యుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశం నందు శాస్త్రోక్తంగా జరిగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తజనం తరలివచ్చింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అంతర్వేది ధామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.