తుఫాను బాధితుడు కన్నీళ్లు: 'ఎవరూ పట్టించుకోలేదు' అని ఆవేదన

1319చూసినవారు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావుకు, బాధితుడు నల్లి సువర్ణ రాజు తన ఆవేదనను తెలియజేశారు. బలమైన గాలులకు చెట్టు విరిగి ఇంటిపైన పడిందని, దేవుడే తమను కాపాడాడని, ఇప్పటివరకు ఎవరూ తమను పట్టించుకోలేదని కన్నీటితో తెలిపారు. ఈ పర్యటనలో గొల్లపల్లితో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్