మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని వీక్షించేందుకు, సాగర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 'గోవిందా, నరసింహా' నినాదాలతో తీరప్రాంతం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.