రాజోలు - Razole

రాజోలు: పైఅంతస్తు నుంచి జారిపడి భవ్యశ్రీ మృతి

రాజోలు: పైఅంతస్తు నుంచి జారిపడి భవ్యశ్రీ మృతి

రాజోలు మండలంలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శివకోటిలోని పుంతలో ముసలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాల సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన 12 మంది నాట్య బృందంలో ఒక కళాకారిణి, పాలపర్తి భవ్యశ్రీ (17), ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో పైఅంతస్తు నుంచి కాలుజారి కిందపడి మృతి చెందింది. ఆమె తలకు తీవ్ర గాయాలవ్వడంతో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎత్తైన పాదరక్షల వల్ల అదుపు తప్పి జారిపడినట్లు తోటి కళాకారులు తెలిపారు. మెట్లకు రక్షణ గోడలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా