
శివకోటిలో కుంతలేశ్వరి అమ్మవారి తీర్థం
రాజోలు మండలం శివకోటిలోని శ్రీ కుంతలేశ్వరి అమ్మవారి తీర్థ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించగా, భక్తుల రద్దీతో పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.



































