తుని - Tuni

రోడ్డు ప్రమాదంలో తెగిపడిన యువకుడి చేయి

రోడ్డు ప్రమాదంలో తెగిపడిన యువకుడి చేయి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి వద్ద గురువారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్.సూరవరం గ్రామానికి చెందిన స్వామి, హెటెరో కంపెనీలో విధులను ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దానికి ఉన్న ఇనుప కమ్మె చేతికి తగలడంతో వాహనం నడుతున్న అతని ఎడమ చేయి తెగి కిందపడింది. అనంతరం ద్విచక్ర వాహనం కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
Top 10 viral news 🔥
ఇంటర్ విద్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 11వ తరగతికి బోర్డు పరీక్ష రద్దు!
Nov 13, 2026, 02:11 IST/

ఇంటర్ విద్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 11వ తరగతికి బోర్డు పరీక్ష రద్దు!

Nov 13, 2026, 02:11 IST
తెలంగాణలో 2027-28 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యాసంస్థలో బోధన అందించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పదో తరగతి తర్వాత ఏటా 40–45 వేల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 19 మినహా మిగిలిన 411 కాలేజీలను ఉన్నత పాఠశాలలతో అనుసంధానించనున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకూ 9 నుంచి 12వ తరగతి వరకు బోధించే అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు.