తుని రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం

1935చూసినవారు
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై హౌరా–చెన్నై మెయిల్ జనరల్ కోచ్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఐబీ సిబ్బంది సంయుక్త తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, లగేజ్ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద మూడు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో మనోజ్ ప్రధాన్ (27), శంభునాథ్ జనా (29), అజయ్ జనా (25) ఉన్నారు.

సంబంధిత పోస్ట్