తునిలో అంగన్‌వాడీ ఉత్సవం: ఎమ్మెల్యే యనమల దివ్య చేతుల మీదుగా కిట్ల పంపిణీ

0చూసినవారు
తునిలో అంగన్‌వాడీ ఉత్సవం: ఎమ్మెల్యే యనమల దివ్య చేతుల మీదుగా కిట్ల పంపిణీ
కాకినాడ జిల్లా తుని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మంగళవారం అంగన్‌వాడీ ఉత్సవం ఘనంగా జరిగింది. తుని శాసనసభ్యురాలు యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, పూర్వ ప్రాథమిక విద్యను సమర్థవంతంగా అందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అభినందించి సత్కరించారు. ప్రీ-స్కూల్ చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలు, బోధనా కిట్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు. పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్