తుని రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్, ముంబై ఎల్టిటీ, ఏపీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ప్రకటించి చాలాకాలం అయినా, ఇప్పటివరకు రైళ్లకు హాల్ట్ ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆకెళ్ళ శాస్త్రి, కె. రామకృష్ణ రైల్వే అధికారులకు వినతిపత్రం అందించారు. తునితో పాటు సమీప నియోజకవర్గాల ప్రజలు ఈ మూడు రైళ్ల హాల్ట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని, అయితే హాల్ట్ ప్రకటించినా రైళ్లు ఎప్పుడు ఆగుతాయో ప్రకటించకపోవడం ప్రయాణికుల్లో గందరగోళానికి దారితీస్తుందని తెలిపారు. ఇప్పటికైనా హాల్ట్ తేదీ ప్రకటించి ఆయా రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.