తుని పెద్దవీధిలో జరిగిన బైక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రెండు బైకులను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించినట్లు టౌన్ ఎస్ఐ విజయబాబు తెలిపారు. ముగ్గురు దుండగులు రెండు బైకులను దొంగిలించగా, మరో రెండు బైకుల తాళాలు పగులగొట్టారు. రాత్రి గస్తీ పోలీసులు వెంబడించడంతో దుండగులు బైకులను వదిలి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.