కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ లో బొంబాయి టు భువనేశ్వర్ వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న శృతి రేఖ అనే మహిళకు రైలు కదులుతుండగా వాష్ రూమ్ లో ఆదివారం డెలివరీ అయింది. దురదృష్టవశాత్తు, పుట్టిన పాప మృతి చెందింది. వెంటనే అధికారులు స్పందించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది హుటాహుటిన స్పందించి, మహిళను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం తల్లి క్షేమంగా ఉంది.