తలుపులమ్మ ఆలయానికి భక్తుల రద్దీ.. రూ. 8. 86 లక్షల ఆదాయం

959చూసినవారు
తలుపులమ్మ ఆలయానికి భక్తుల రద్దీ.. రూ. 8. 86 లక్షల ఆదాయం
తుని మండలం లోవలోని తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆదివారం సుమారు 28 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ దర్శనాలలో ప్రసాదాల విక్రయాలు, పూజా టికెట్లు, కేశఖండనం, వాహన పూజలు, కాటేజీల అద్దె, విరాళాల రూపంలో దేవస్థానానికి రూ. 8, 86, 211 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి విశ్వనాథ రాజు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్