కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది: దాడిశెట్టి రాజా

232చూసినవారు
తునిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళలు, రైతులు, యువతలో అసంతృప్తి పెరిగిందని, ఉద్యోగాల కల్పన పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అమరావతి పేరుతో భారీ అప్పులు చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్