రైతులకు రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ

664చూసినవారు
రైతులకు రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ
రైతులకు భూములపై మరింత భద్రతతో కూడిన హక్కులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాలను అందజేస్తోందని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. శుక్రవారం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో రైతులకు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, భూ హక్కుల పరిరక్షణతో పాటు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్