ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే దివ్య

974చూసినవారు
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే దివ్య
తుని కూటమి కార్యాలయంలో ఆదివారం 3, 4, 5, 6 వార్డుల టీడీపీ క్యాడర్ సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరై, వార్డుల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హుల ఓట్ల నమోదుపై దృష్టి సారించాలని ఆమె పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్