సీహెచ్ అగ్రహారం బాలిక జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారులు, కేంద్ర బృందాలు రంగంలోకి దిగాయి. బాలిక ఆచూకీ కోసం తొమ్మిదో రోజు గాలింపు చర్యలను హోంమంత్రి ప్రత్యేకంగా ఆదేశించడంతో మరింత ముమ్మరం చేశారు.