ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు అనుమతి ఇవ్వడంతో తుని మున్సిపాలిటీ స్వరూపం మారనుంది. సుమారు 43,050 జనాభా కలిగిన తుని పట్టణంలో ప్రస్తుతం ఉన్న 30 వార్డుల సంఖ్య 36కు పెరగనుంది. ప్రతి వార్డులో సగటున 1,250 మంది ఓటర్లు ఉండేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో స్థానిక నేతలకు అదనపు పదవులు దక్కే అవకాశం ఉంది.