తునిలో విద్యార్థినులను పరామర్శించిన జనసేన నేత యనమల కృష్ణుడు

1543చూసినవారు
తునిలో విద్యార్థినులను పరామర్శించిన జనసేన నేత యనమల కృష్ణుడు
కాకినాడ జిల్లా తునిలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను జనసేన నియోజకవర్గ నేత యనమల కృష్ణుడు ఆదివారం పరామర్శించారు. తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, చోడిశెట్టి గణేష్, అద్దేపల్లి బాలాజీ, వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్