తుని మండలం డీ. పోలవరం గ్రామంలోని 21వ నెంబర్ రేషన్ డిపోను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చింతల జానకిదేవికి చెందిన ఈ డిపోలో స్టాకు వివరాలను, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరుకుల పంపిణీ జరుగుతుందా లేదా అనే అంశాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. సరుకుల నాణ్యతతో పాటు ఇతర అంశాలను కూడా ఆమె పరిశీలించారు.