చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం: ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు

376చూసినవారు
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం: ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు
కాకినాడ, తుని ప్రాంతాలలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. జిల్లా పోలీసులతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని, దట్టమైన అడవుల్లోకి వెళ్లగలిగే అటవీశాఖ నిపుణుల సహాయంతో గాలింపు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కాకినాడ ఎస్పీతో ఫోన్ లో సమీక్షించి, 400 మందికి పైగా సిబ్బంది, డ్రోన్ల సహాయంతో గాలింపు జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్