ఆదివాసీ రైతులకు సేంద్రీయ వ్యవసాయంలో నాసా శిక్షణ

444చూసినవారు
ఆదివాసీ రైతులకు సేంద్రీయ వ్యవసాయంలో నాసా శిక్షణ
శంఖవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో ఆదివాసీ రైతులకు నాసా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సేంద్రీయ వ్యవసాయంలో నూతన పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. నాసా ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీను తక్కువ పెట్టుబడితో ఘన, ద్రవ జీవామృతాలను తయారుచేసుకునే విధానాన్ని వివరించి, ప్రత్యక్షంగా తయారుచేసి చూపించారు. ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రసాద్ ఎండిపోయిన కొమ్మలను కత్తిరించుకోవాలని, జీవామృతాల వాడకం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.పి.ఓ సభ్యులు సీత, స్థానిక రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్