కాకినాడ, తుని మండలంలోని హంసవరం గ్రామంలో నాసా సంస్థ ఆధ్వర్యంలో జీడి మామిడి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణలో ICRP సిబ్బంది ఆదిలక్ష్మి, ఫీల్డ్ కోఆర్డినేటర్ పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం వాడుతున్న రసాయనాలకు బదులు సేంద్రియ పద్ధతులు, అంతర పంటల యాజమాన్యం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యత గల ఉత్పత్తిని పొందవచ్చని, దీనివల్ల చెట్టు, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాసా సిబ్బంది అప్పారావు, సరస్వతి, బుల్లబ్బాయి, మరియమయ్యా, పలువురు రైతులు పాల్గొన్నారు.