తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ, ఉచిత విద్యుత్తు పథకం ద్వారా చేనేత కార్మికుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపిందని తెలిపారు. పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత కార్మికుల మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించే పథకానికి బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యనమల దివ్య తుని నియోజకవర్గంలోని 2064 మంది చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.