రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

5చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాల్లాపురం సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. పెరుమాల్లాపురం నుంచి ఒంటి మామిడి వెళ్తున్న బొలెరో వాహనం, ఒంటిమామిడి నుంచి పెరుమాల్లాపురం మీదుగా వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్