కాకినాడ జిల్లా తుని పట్టణ శివారులో పోలవరం కాలువ పనుల వద్ద స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువ తవ్వకాల్లో బాంబ్ బ్లాస్టింగ్లు చేయడం వల్ల తమ ఇళ్లకు బీటలు వస్తున్నాయని వారు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో జీవీఎస్ ప్రసాద్ సంఘటనా స్థలానికి సోమవారం వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడారు. బాంబ్ బ్లాస్టింగ్ తీవ్రతను తగ్గించాలని వారు ఎమ్మార్వోను కోరారు.