చిన్నారిజ్ఞానేశ్వరిజాడ కోసం పాంప్లెట్స్ అంటిస్తున్న పోలీసులు

9చూసినవారు
చిన్నారిజ్ఞానేశ్వరిజాడ కోసం పాంప్లెట్స్ అంటిస్తున్న పోలీసులు
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 29 రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు విస్తృత ప్రచారంలో భాగంగా పోస్టర్లు అంటిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఉంటుందని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ప్రయత్నం ఫలించి, పాప తల్లిదండ్రుల చెంతకు చేరాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ సంఘటన కాకినాడ, తుని ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్