కోడిపందేలపై పోలీసుల మెరుపుదాడి...11 మంది అరెస్ట్

4చూసినవారు
కోటనందూరు మండలం కె. ఓ. అగ్రహారం గ్రామంలో నిర్వహిస్తున్న అక్రమ కోడిపందేలపై పోలీసులు ఆదివారం దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5, 700 నగదు, ఒక కోడిపుంజు, రెండు కత్తులు, 13 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ జి. చెన్నకేశవ సూచనల మేరకు కోటనందూరు ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడిపందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీసులు ప్రజలకు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్